. . . కేంద్ర ప్రభుత్వ మెమో 57, రాష్ట్ర హై కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
. . . ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వం పాత పెన్షన్ అమలు చేయాలని ఈనెల 7 న ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి ఇందిరా పార్కు దగ్గర మహా విజ్ఞాపన సభ ను నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల 2003 ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ కోరారు. ఆదివారం కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా ఇటీవల రాష్ట్ర హై కోర్టు తీర్పును అమలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. ఇప్పటికే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మెమో ను అనుసరిస్తూ పాత పెన్షన్ విధానాన్ని తమ ఉద్యోగులకు వర్తింపజేశాని, ప్రక్క రాష్ట్రం ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూడా పాత పెన్షన్ కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని, మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పాత పెన్షన్ అమలు చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 7న జరిగే కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ జేఎసి నాయకులు, ఫ్రొఫెసర్ కోదండరామ్ పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు కనకపురం రవింధర్, పరమేశ్వర్, శ్రీహరి, రాజ్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, మాణిక్యం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
