28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పరిశుభ్రతను పాటిస్తూ, రుచికరమైన భోజనాన్ని అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . ప్రొఫెసర్ యాదగిరి రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

హాస్టల్స్ లో ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తూ, విద్యార్థులకు మంచి నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలని వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. గత నెల డిసెంబర్ 29న ఫుడ్ సేఫ్టీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సూపర్వైజర్ ఆధ్వర్యంలో అన్ని హాస్టల్స్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన హాస్టల్ సిబ్బందికి తెలంగాణ యూనివర్సిటీలో కామర్స్ సెమినార్ హాల్లో మంగళవారం ఉదయం సామర్థ్య ధృవీకరణ పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ యాదగిరి, చీఫ్ వార్డెన్ రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, వార్డెన్స్ గంగాకిషన్, జ్యోత్స్న, కిరణ్ రాథోడ్‌లతో పాటు అన్ని హాస్టల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article