కామారెడ్డి, బతుకమ్మ :
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నాయని మహిపాల్ యాదవ్‌ను నియమించినట్లు బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందే శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీ పట్ల మహిపాల్ యాదవ్ ప్రదర్శించిన నిబద్ధత, సేవా దృక్పథం, అలాగే కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తత్వాన్ని గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ఆయన నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో కార్మిక విభాగం మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కన్వీనర్‌గా నియమితులైన మహిపాల్ యాదవ్ స్పందిస్తూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందే శ్రీనివాస్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి రాంరెడ్డి, పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి తదితర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం, కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని నాయని మహిపాల్ యాదవ్ తెలిపారు.

