బీజేపీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా మహిపాల్
కామారెడ్డి, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా నాయని మహిపాల్ యాదవ్‌ను నియమించినట్లు బీజేపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు అందే శ్రీనివాస్ ప్రకటించారు. పార్టీ పట్ల మహిపాల్ యాదవ్ ప్రదర్శించిన నిబద్ధత, సేవా దృక్పథం, అలాగే కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తత్వాన్ని గుర్తించి ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ఆయన నాయకత్వంలో కామారెడ్డి జిల్లాలో కార్మిక విభాగం మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం...