25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : మహిళా శక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళాశక్తి భవనం పనులను గురువారం రోజున కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళాశక్తి భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణం పనులను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు 5 కోట్ల రూపాయలతో పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణం పనులు నాణ్యతతో చేపట్టాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణం పనులు పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, ఇతర ఇంజనీర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article