ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్, తడపాకల్, గుమ్మిర్యాల, నాగేంద్రనగర్, దోంచంద, బట్టపూర్, తోర్తీ గ్రామాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తాల్లారాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు విద్య విస్తరణకు చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్మరనీయమని అన్నారు. తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రతి విద్యార్థి పూలే ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సామాజిక అసమానతల తొలగించిన క్రాంతి రేఖ దినజనుల జీవితాల్లో వెలుగు రేఖ అని మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మీ శ్రీనివాస్, తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్, ఉప సర్పంచ్ చాట్ల జనార్ధన్, తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్, ఉప సర్పంచ్ లోలపు రాజు, గ్రామ ప్రజలు పంచాయితీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, భోజన్న, రాకేష్, రవి, కారోబార్ సాయన్న, హనుమాడ్లు, శంకర్, గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
