26.1 C
Hyderabad

మహాత్మా జ్యోతిబా పూలే  జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: బోధన్ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు గాండ్ల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, జ్యోతిబా పూలే బహుజనుల విద్యాభివృద్ధికి, మహిళల హక్కుల కోసం జీవితాంతం పాటుపడ్డ మహానుభావులని కొనియాడారు. ఆయన ఆశయాలను సాకారం చేయాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరివెసు సంతోష్, బహుజన నాయకులు దుప్ సింగ్, విద్యాసాగర్, శంకర్ గౌడ్, జాదవ్ ప్రవీణ్, జక్కా సంజీవ్, బొద్దు శంకర్, వరదయ్య, సాగర్, జాకీర్, మోచి శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article