మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
బతుకమ్మ, బోధన్: బోధన్ నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు గాండ్ల రవీందర్ యాదవ్ మాట్లాడుతూ, జ్యోతిబా పూలే బహుజనుల విద్యాభివృద్ధికి, మహిళల హక్కుల కోసం జీవితాంతం పాటుపడ్డ మహానుభావులని కొనియాడారు. ఆయన ఆశయాలను సాకారం చేయాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరివెసు సంతోష్, బహుజన నాయకులు దుప్ సింగ్, విద్యాసాగర్, శంకర్...