24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాదిగ జేఏసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమరి రవి నాయకత్వాన్నిబలోపేతం చేయడానికి ఈ జిల్లా కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని జిల్లాలో మాదిగలను ఏకం చూస్తూ జాతి అభివృద్ధి హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. మాదిగ జేఏసీ జిల్లా ఇంచార్జీగా మోతె భూమన్న మాదిగ, మాదిగ జేఏసీ అధికార ప్రతినిధిగా మల్లాని శివ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంగరాల రాజేశ్వర్ మాదిగ, బోయిని జోసఫ్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులుగా బచ్చపల్లి దేవయ్య మాదిగ, కనక ప్రదీప్ మాదిగలను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యవర్గ సభ్యులుగా విట్టల నరేష్ మాదిగ, కందుల రాములు  మాదిగ, తైదా పోశెట్టి మాదిగ, సగ్గుపట్ల చిరంజీవి మాదిగ, తెడ్డు రాజేష్ మాదిగ, సంఘం ప్రభాకర్ మాదిగలను ఎన్నుకున్నట్లు తెలిపారు. మాదిగ జేఏసీ నిజామాబాద్ జిల్లా మహిళా విభాగం కన్వినర్ గా బాయికాడి లతను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.

More articles

Latest article