మాదిగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

0 1,308

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని దీపక్ గార్డెన్స్ లో జిల్లాస్థాయి మాదిగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు  మంద దేవేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ  ఆగస్టు 1 2024లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక  తీర్పును వెంటనే అమలు చేస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి వెంటనే చట్టబద్ధత కల్పించి వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏక సభ్య కమిషన్ ఇచ్చిన తొమ్మిది శాతం రిజర్వేషన్లు జనాభా వాటా ప్రకారం 11 శాతానికి పెంచాలని, ఏబిసి గ్రూపులలో ఉన్న అసమానతలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన సామాజిక ఉద్యమకారుడు మాదిగ జాతి ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంద కృష్ణ మాదిగ పిలుపులో మాదిగ ఉద్యోగులమందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా మాదిగ ఉద్యోగలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు తెడ్డు గంగారం, నాంపల్లి, మహేష్, బాబా శ్రీనివాస్, శ్రీనివాస్, మారుతి, రమేష్, జిల్లా నలుమూలల నుండి ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.