మాదిగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని దీపక్ గార్డెన్స్ లో జిల్లాస్థాయి మాదిగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆగస్టు 1 2024లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును వెంటనే అమలు చేస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత రెడ్డి వెంటనే చట్టబద్ధత కల్పించి వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు....