29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎల్ఆర్ఎస్ సర్వే పక్కాగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : ఎల్ఆర్ఎస్. సర్వే పక్కాగా, వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం  కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ వార్డ్ నెంబర్ 1 లోని పలు భూముల ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్.ఆర్.ఎస్. పథకం సర్వే ను మార్గదర్శకాలకు అనుగుణంగా, వేగవంతంగా సర్వే నిర్వహించాలని అన్నారు. రెవిన్యూ, మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా భూములను పరిశీలించాలని తెలిపారు. వివరాలను సర్వే యాప్ లో పొందుపర్చాలని తెలిపారు. పకడ్బందీ గా, పక్కాగా సర్వే చేపట్టాలని అన్నారు. ఏ రోజు కారోజూ నివేదికలను అప్ డేట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, మున్సిపల్ కమీషనర్ సుజాత, తహసీల్దార్ జనార్ధన్, మున్సిపల్, రెవిన్యూ, నీటి పారుదల శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LRS survey should be conducted properly

More articles

Latest article