27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ కు లోకాయుక్త నోటీసులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్  పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్సై, నిఘా విభాగంలో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్ కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.  ఓ యువకుడు తనపై పోలీసులు అక్రమంగా గొలుసు దొంగతనం కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త యువకుడు సమర్పించిన ఆధారాలతో నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక సీఐకి, ఒక పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ పనిచేస్తున్న ఎస్ఐకి, నిఘా విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ లను ఈనెల 22న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

నిజామాబాద్ నగరంలో ఒక పోలీస్ స్టేషన్ లొ ఒక యువకుడి పై గడిచిన ఏడాది స్థానిక పోలీసులు గొలుసు దొంగతనం కేసు నమోదు చేశారు. ఫిర్యాదు దారు యువకుడి ప్రేయసి కావడం విశేషం. రెండు సంవత్సరాలకు పైగా యువతి యువకుడు ప్రేమలో మునిగితేలారు. మొబైల్ షాప్ నిర్వహించే యువకుడి వద్దకు వచ్చిన తన ప్రేయసి ఫ్రెండ్ ద్వారా మరో యువతి పరిచయమయ్యారు. తన ప్రేయసి మరో యువతి ఇద్దరూ క్లాస్మేట్లు కావడంతో సదరు మొబైల్ షాప్ యువకుడితో మంచి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో యువకుడి ప్రేయసి, మరో యువతి తాను చదువుతున్న బి బి ఏ కాలేజీలో లెక్చరర్ అడిషనల్ మార్కులు వేస్తానని రూ .40,000 తీసుకొని మోసం చేశాడు. దానిని యువకుడు తన మొబైల్ షాప్ ఏరియాలోని సీఐకి ఈ విషయాన్ని తెలిపాడు. ఈ విషయంలో సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తన అధికారాన్ని ఉపయోగించి ఆ లెక్చరర్ వద్ద రూ.40,000 తీసుకొని యువతికి అప్పగించాడు. దానితో సదరు సీఐ కి ఆ యువతి మధ్య కమ్యూనికేషన్ సోషల్ మీడియా ద్వారా పెరిగి పెద్దదయింది. ఇద్దరి మధ్య ముదురు ప్రేమ వ్యవహారం బట్టబయలు కావడంతో  సంబంధిత వీడియో చాటింగ్ లు వాట్సాప్ చాటింగ్ లు బహిర్గతమయ్యాయి. సీఐ తో యువతి ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడటంతో యువతి తల్లిదండ్రులు ముందు జాగ్రత్త వహించి ఆమెను ఉన్నపలంగా విదేశాలకు ఉన్నత చదువుల పేరుతో పంపించివేసినట్టు తెలిసింది. తన తో యువతి క్లోజ్ గా ఉండే వ్యవహారం బహిర్గతం కావడం వెనుక మొబైల్ షాప్ నిర్వాకుడైన యువకుడి ప్రమేయంపై సీఐ లోలోపల రగిలిపోయాడు. యువకుడిని టార్గెట్ చేసేందుకు సమయం కోసం వేచి చూస్తున్న సమయంలో యువకుడి ప్రేయసి తండ్రికి కూతురు ప్రేమ వ్యవహారం తెలిసింది. సదరు యువతి తండ్రి నిఘా విభాగంలో  హెడ్ కానిస్టేబుల్ కావడంతో తన పరపతి మీకు ఉపయోగించి సీఐ ద్వారా యువకుడు పై తన ఇంటి వద్ద కూతురి బంగారు గొలుసు దొంగిలించాడని కేసు నమోదు చేయించారు. అంతేగాకుండా యువకుడిని తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. ఈ విషయాన్ని సదరు యువకుడు అప్పటి పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసిన ఈ కేసును బహిర్గతం కానివ్వలేదు. యువకుడు పై నమోదైన చైన్ స్నాచింగ్ కేసులో వేధింపులు తీవ్రం కావడంతో యువకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దానితో పోలీసులు యువకుడి తల్లి తోపాటు ఇతర కుటుంబ సభ్యులను వేధించారు. దానితో అతడు రాష్ట్రస్థాయిలో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు లోకాయుక్తను ఆశ్రయించాడు. ఈ కేసులో ఎస్సైకి ప్రమేయం లేకపోయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో సదరు యువకుడు ముగ్గురి పై లోక యుక్తాలో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

More articles

Latest article