29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రూ.2 లక్షల ఎల్ఓసి అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ  మండలం కిసాన్ నగర్ గ్రామానికి  చెందిన నిజాముద్దీన్ ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కి గురై తలకు తీవ్ర గాయాలతో నిమ్స్ లో చేరి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో అతని చికిత్స కొరకు ఎమ్మెల్యే వేముల రూ.2 లక్షల  ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఎల్ఓసి కాపీ ని సంబంధిత కుటుంబ సభ్యులకు ఆదివారం హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన మాకు చికిత్స కొరకు రూ.2.00 లక్షల ఎల్ఓసీ ఎమ్మెల్యే మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేసారు.అదే విధంగా అతనికి మెరుగైన చికిత్స అందజేయాలని,భుజానికి కావాల్సిన శస్త్ర చికిత్స ఆరోగ్య శ్రీ ద్వారా చేయాలని నిమ్స్ హాస్పిటల్ వైద్యులను ఎమ్మెల్యే  కోరారు.

More articles

Latest article