29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అర్హులైన రైతులందరికీ రుణమాఫీ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం బుడిమి, తాడ్కోల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కోపిశెట్టి కిరణ్మయితో కలిసి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట దిగుబడిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బుడిమి సొసైటీ ఛైర్మన్ గంగుల గంగారాం, వైస్ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, బాన్సువాడ సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ ఏఈవో రాణి, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఖాలేక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్, అంజిరెడ్డి, గోపాల్ రెడ్డి, మోహన్ నాయక్, పిట్ల శ్రీధర్, నార్ల సురేశ్, ఎండీ దావుద్, మాజీ సర్పంచ్ రాజు, అఫ్రోజ్, ఎజాస్, అలీముద్దీన్ బాబా , భీమా నాయక్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article