అర్హులైన రైతులందరికీ రుణమాఫీ
బాన్సువాడ, బతుకమ్మ : అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం బుడిమి, తాడ్కోల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కోపిశెట్టి కిరణ్మయితో కలిసి పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పంట దిగుబడిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు...