27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లిక్కర్ కిక్కు..

Must read

📰 Generate e-Paper Clip

  • 151 మద్యం దుకాణాలు.. రూ.3500 కోట్ల దందా
  • రెండు సంవత్సరాలలో డబుల్ పెరిగిన ఆదాయం
  • కొత్త మద్యం దుకాణాల నిర్వహణ లైసెన్స్ లకు దరఖాస్తులు స్వీకారం
  • లక్కీ డ్రా నిర్వహణతోనే కోట్లలో ఆదాయానికి అంచనా

 

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మద్యం పాలసీని ప్రకటించింది. గతంలోను ఆనాటి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు ఖజానా ఖాలీగా ఉండటంతో రెండు నెలల ముందే మద్యం (2023-25) లో ఏ4 దుకాణాల కేటాయింపు (లైసెన్స్ ల జారీకి) కి టెండర్లను ఆహ్వానించింది. దాని ద్వార ప్రభుత్వ ఆదాయానికి బూస్టింగ్ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం సైతం డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కావాల్సిన నేపత్యంలో 35 రోజుల ముందు నయా లిక్కర్ పాలసీని ప్రకటించింది. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించి 23న ఓపెన్ టెండర్ లను తెరిచి లక్కీ డ్రా ద్వార 2025-27 సంవత్సరాలకు మద్యం దుకాణాల నిర్వహణకు లైసెన్స్ లను కేటాయించనున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 151 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2023-25 సంవత్సరాలకు సంబంధించి సుమారు 3500 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 102 షాపులకు ప్రతినెలా రూ.105 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని ఐఎంఏల్ డిపోల అధికారులు తేల్చారు. నిజామాబాద్ జిల్లాలో 2023-24 లో రూ.1180 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2024-25 ఆగస్టు మాసం వరకు రూ.919 కోట్ల అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలు మిగిలే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు సంవత్సరాల కాలంలో 3500 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2021-2023 సంవత్సారాల ఆదాయానికి రెట్టింపు కావడం గమనార్హం. గతంలో మద్యం దుకాణాలను వేలం పాట మాదిరిగా సీక్రేట్ టెండర్లలో ఎక్కువ ధర కోట్ చేసిన వారికి మాత్రమే లైసెన్స్లు దక్కేవి. దాని ద్వార లిక్కర్ వ్యాపారంలో ముదుర్లు (సిండికేట్ )గా ఏర్పడి మద్యం వ్యాపారాన్ని శాసించారు. గత ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని పారదర్శకంగా నిర్వహణకు ఒపెన్ టెండర్ అది కూడా లక్కీ డ్రా ద్వార కేటాయించడమే కాకుండా గౌడ కులస్తులకు, ఎస్ సి, ఎస్టీ లకు  24 శాతం రిజర్వు షాపులను కేటాయించడంతో చాలమంది ఉత్సహంగా మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. నిజామాబాద్ జిల్లాతో పోల్చితే కామారెడ్డి జిల్లాలో మద్యం వ్యాపారం తక్కువగా, షాపులు తక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆగస్టు వరకు 2099 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే, కామారెడ్డిలో 1000 కోట్ల లోపు మద్యం అమ్మకాలు జరిగాయని అంచనా వేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఒపెన్ టెండర్ల నిర్వహణ ద్వార 2023-25 సంవత్సరానికి గాను 102 షాపులకు 3759 దరఖాస్తులు రాగా రూ.76 కోట్ల ఆదాయం వచ్చింది. కేవలం టెండర్ ఫారాల ద్వార  2021-23లో 1702 దరఖాస్తులతో  రూ.34 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు సంవత్సరాలలోనే కేవలం దరఖాస్తుల ద్వారనే రెండింతల ఆదాయం అబ్కారీ శాఖకు వచ్చింది. ఈసారి నిజామాబాద్ జిల్లాలోనే రూ.150 కోట్ల మేరకు ఒపెన్ టెండర్ దరఖాస్తులు (నాన్ రిఫండబుల్) ద్వార వస్తుందని ఆంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోను రూ.250 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ అధికారులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రాబోయే రెండు సంవత్సరాలలో మద్యం అమ్మకాలు రూ.5 వేల కోట్లకు చేరిన ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపో మాపో మొగడం ఖాయం కాగా పాత వ్యాపారులకు అది మేలు చేకూరనుంది. కొత్త మద్యం పాలసీలో బల్ధియా ఎన్నికలు పట్టణ వ్యాపారులకు బూస్ట్ గా చెప్పాలి. 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నయా మద్యం పాలసీ దారులకు పండగలు, పబ్బాలపైనే ఆశలు మిగలనున్నాయి.

More articles

Latest article