27.7 C
Hyderabad

ఏసీబీ వలలో లింగంపేట ఎస్సై

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై కే సుధాకర్ ఏసీబీకి చిక్కారు.  వాహనాలు అమ్మకాలు, కొనుగోలు చేసే ఓ వ్యాపారి నుంచి వాహనానికి రూ.12వేల చొప్పున లంచం అడిగిన ఎస్సై… నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రుక్మిణి చాంబర్ (హనుమాన్ జంక్షన్)  ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం రూ.12,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  సుధాకర్ కు ముందు పని చేసిన ఎస్సై సైతం స్టేషన్ బెయిల్ కేసులో లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే.

More articles

Latest article