27.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . స్క్రీనింగ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలి

 

. . .  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై మంగళవారం డీఎంహెచ్‌వో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జీవనశైలి వ్యాధుల నియంత్రణలో భాగంగా ఆయుష్మాన్ భారత్ (ఆభా) కార్డు జనరేషన్‌ను వేగవంతం చేయాలని, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే ఎంసీహెచ్, ఎన్‌సీడీ, యూవిన్, ఆమ్ పోర్టల్‌లలో నమోదులను పూర్తి చేయడంతో పాటు, ఆబాస్ అటెండెన్స్‌ను 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 30 సంవత్సరాలు పైబడిన జనాభా సుమారు 52 శాతం ఉన్నందున, వారికి హైపర్‌టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టీకాల ద్వారా నివారించగల వ్యాధుల నియంత్రణలో భాగంగా పోలియో, మీజిల్స్ అనుమానిత కేసులకు సంబంధించిన నమూనాలను సకాలంలో పంపించాలని సూచించారు. అత్యంత ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణీ స్త్రీలను ముందుగానే గుర్తించి, ప్రసవ ప్రణాళిక రూపొందించి, సురక్షిత ప్రసవం కోసం అవసరమైన ఆసుపత్రులకు రిఫర్ చేయాలని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజూ కనీసం 60 మంది వరకు ఓపీ సేవలు అందేలా చూడాలని, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా అందించే అన్ని సేవలు గ్రామస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డా.వెంకన్న, డా.శిఖర, డా.వెంకటేష్, డా.శ్రావ్య, ఎస్‌ఓ రాజేశ్వర్, డీపీఓ విశాల, డీహెచ్‌ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు, డీడీఎం పృధ్వీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article