. . . గుట్టుచప్పుడు కాకుండా భర్తను ప్రియుడితో కలిసి హత్య
. . . హత్య కేసులో సాంకేతిక సాక్ష్యాలే కీలకంగా మారిన వైనం
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన గుగ్లోత్ యమున ఆమె ప్రియుడు నునావత్ నందు లకు జీవిత కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం తీర్పు చెప్పారు. పూర్తి వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుగ్లోత్ శంకర్ కు మొదటి భార్య వలన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలిగిన చాలా ఏళ్లకు మనస్పర్థలు ఏర్పడంతో విడాకులు తీసుకున్నారు. పెద్ద కొడుకు రమేష్ తో కలిసి జీవించేవాడు. తరువాత జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన యమునను వివాహం చేసుకున్నాడు. వీరి దాంపత్య జీవితంలో ఒక కూతురు కలిగింది.యమునకు ఆలూరు గ్రామ నివాసుడైన నునావత్ నందు తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. అక్రమ సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భర్త పెద్ద కొడుకు రమేష్, కోడలు నిజామాబాద్ కు ఆసుపత్రికి వెళ్లగా అదును చూసిన యమున 2025 మే 7న తెల్లవారు జామున మూడు గంటలకు వర్షం చినుకులు పడటంతో ఇంటి డాబా పైనిద్రిస్తున్న వారు మెట్లపై దిగుతుండగా యమున వెనుక నుండి తన భర్త శంకర్ ను నూకివేయడంతో కిందపడిన ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. గాయపడిన అతనిని మెట్ల నుండి ఇంటిలోకి తీసుకువచ్చింది. భార్యభర్తలు ఇంటి డాబా పై నుండి వచ్చేటప్పుడు చూసిన పక్కింటి మాలోత్ మహేష్ వీరి ఇంటిలోకి వచ్చి ఏమైనా అయ్యిందా అని అడగడంతో ఏమి కాలేదు మెట్ల పై నుండి పడి తన భర్తకు గాయాలయ్యాయని నమ్మబలికింది. అతను వెళ్లిన అనంతరం యమున కట్టేతో భర్త తలపైన ఇతర చోట్ల కొట్టి గాయపరచింది. అయిన తన భర్త చావలేదని ఒక ఇనుప రాడ్ తో తలపైన ముఖంపైన కొట్టి తీవ్రంగా గాయపరచింది. ఎంతకు తన భర్త మరణిస్తలేడని ప్రియుడికి ఫోన్ చేసింది అతను ఫోన్ లేపకపోవడంతో అతని ఇంటికి వెల్లి తీసుకొని వచ్చింది. శంకర్ ను చంపివేయాలని నిర్ణయించుకున్న వారు భర్త శంకర్ కాళ్లు నందు పట్టుకోగా యమున గొంతు పిసికి వేయడంతో మరణించాడు. మర్నాడు ఉదయం ఇంటికి వచ్చిన శంకర్ కొడుకు నాన్నకు ఏమైంది అని అడగడంతో దాడా పైనుండి పడి గాయాలు అయి మృతి చెందాడని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన అతను, కుల పెద్దలు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల అనంతరం చిన్నమ్మ యమున ముఖకవలికలు, ఆమె ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో గట్టిగా అడగడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.రమేష్ పిర్యాదు స్వీకరించిన మాక్లూర్ పోలీసులు ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించి తదుపరి నేర విచారణ బాధ్యతను నిజామాబాద్ ఉత్తర సర్కిల్ ఇన్స్ పెక్టర్ బి. శ్రీనివాస్ కు అప్పగించారు. నేర విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని యమున, నందు లను అదుపులోకి తీసుకున్న నేర విచారణ అధికారి శ్రీనివాస్ వారి నేర ఒప్పుకోలు పంచానామ, హత్యకు ఉపయోగించిన వస్తువుల స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముద్దాయిల తరపున న్యాయవాదుల వాదనలు విన్న అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ యాభై తొమ్మిది పేజీలు తీర్పును వెలువరించారు. హత్య నేరారోపణలు, నేరం నుండి తమనుతాము కాపాడుకోవడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం సాక్ష్యాలను ధ్వంసం చేయడం రుజువు అయినట్లు కోర్టు నిర్దారించింది. హత్య నేరంకుగాను యమున, నందులకు జీవిత కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా, సాక్ష్యాలను ధ్వసం చేసిన నేరానికిగాను మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానాలు చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల చొప్పున జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తమ తీర్పులో పేర్కొన్నారు.
