29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

లెఫ్టినెంట్ డాక్టర్ ఎం.రామస్వామికి అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాదులో తెలుగుశాఖ అధ్యక్షులుగా, ఎన్సిసి అధికారిగా విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ డాక్టర్ మేకల రామస్వామికి కళాశాల విద్య కమిషనర్  అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, కార్యాలయ బృందం  డాక్టర్ రామస్వామిని మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విధుల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, నిరంతరం చురుకుగా పనిచేసే తత్వం ఉన్న అధ్యాపకుడు డాక్టర్ రామస్వామి అని అభినందించారు. ఈ కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకడెమిక్  కోఆర్డినేటర్ నహేదా బేగం, స్టాఫ్ క్లబ్ కన్వీనర్ డా. రంజిత, పీఆర్.ఓ. డాక్టర్  దండు స్వామి, వినయ్ కుమార్, రమేష్ గౌడ్, రామకృష్ణ,అనసూయ,  ఉమాకిరణ్, గంగాధర్, నరేష్ కుమార్, వెంకటేష్ గౌడ్, సూపరిండెంట్ ఉదయభాస్కర్, తదితర  అధ్యాపకులు, కార్యాలయ ఉద్యోగులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

More articles

Latest article