లెఫ్టినెంట్ డాక్టర్ ఎం.రామస్వామికి అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల నిజామాబాదులో తెలుగుశాఖ అధ్యక్షులుగా, ఎన్సిసి అధికారిగా విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్ డాక్టర్ మేకల రామస్వామికి కళాశాల విద్య కమిషనర్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, కార్యాలయ బృందం డాక్టర్ రామస్వామిని మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విధుల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, నిరంతరం చురుకుగా పనిచేసే తత్వం ఉన్న అధ్యాపకుడు డాక్టర్ రామస్వామి అని అభినందించారు. ఈ...