29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మహనీయుల బాటలో నడుద్దాం

Must read

📰 Generate e-Paper Clip

  • అన్నా బహు సాఠే104వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

బతుకమ్మ,మద్నూర్ : మహనీయుల బాటలో నడుద్దామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. శనివారం మద్నూర్ ఉమ్మడి మండలాల్లోని గోజేగావ్, సిర్పూర్ గ్రామంలో సాహిత్య రత్న, లోక శాహిర్ అన్నా భావు సాఠే 104వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.

Let's walk in the path of the greatsవారు మాట్లాడుతూ మహనీయుల ఆశయాల్లో నడుద్దామని అన్నారు. వారు చేసిన కృషి మరువలేనిదని వారివల్లనే మనం సమాజంలో గౌరవంగా ఉన్నతంగా జీవిస్తున్నాము అన్నారు. మాజీ ఎంపీ బిబి పాటిల్ సొంత సిర్పూర్ గ్రామంలోని బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల అధ్యక్షులు సాయిలు, బస్వరాజ్ పటేల్, నాయకులు ప్రజ్ఞా కుమార్,తుకారాం, రాములు, రమేష్,హన్మండ్లు,శంకర్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Let's walk in the path of the greats

 

More articles

Latest article