27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గుండేపోటుతో రైతు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ రూరల్:

నిజామాబాద్ జిల్లా లో ఒ రైతు గుండేపోటుతో మృతి చెందాడు . ఈ సంఘటన ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన సాద మహిపాల్ (52) పొలం కోసం యూరియా తీసుకునేందుకు సొసైటీ వద్ద క్యూలైన్లో నిలబడి మసాల బస్తా తీసుకున్నాడు. ఒక సంచి తీసి బండి పైనేశాడు మరో సంచి లేపుకొని వస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చి అలాగే పడిపోయాడు. అందరు చూస్తుండగానే క్షణంలో  మహిపాల్  అచేతనంగా ఉండిపోయాడు. హుటాహుటిన మహిపాల్ ను గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ చూపించగా ప్రాణం పోయిందని చెప్పడంతో తోటి రైతులందరూ రైతు మృతదేహాన్ని ఇంటికి తరలించారు.  మహిపాల్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. భర్త ప్రాణం పోయిన విషయం తెలిసిన భార్య బోరున విలపించింది.

More articles

Latest article