23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ లోక్ అదాలత్ విజయానికి కలిసికట్టుగా కదులుదాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ

ఆర్మూర్, బతుకమ్మ :

డిసెంబర్ 21 న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడంలో అందరం పాత్రదారులం అవుదామని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ అన్నారు. ఆర్మూర్ మండల న్యాయసేవాధికార కమిటీ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్మూర్ కోర్టు ఆవరణ అంత అందంగా, పరిశుభ్రంగా ఉన్నదని లోక్ అదాలత్ నిర్వహణ కూడా అదే స్థాయిలో నిర్వహించి ఎక్కువ న్యాయ వివాదాలు పరిష్కరించాలని ఆమె న్యాయవాదుల హర్షధ్వానాల మధ్య తెలిపారు.అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు ఉండాల్సిన అన్ని సౌకర్యాలు ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు కాన్స్టిట్యూషన్ కోర్టులను, దిగువ కోర్టులు ట్రయల్ కోర్టులను అన్నారు.రాజీ పడదగిన క్రిమినల్ కేసులను రాజీ పద్ధతిన ఇరుపక్షాల ఆమోదం మేరకు పరిష్కరిస్తామని కానీ రాజీకి వీలు లేని కేసులు కోర్టు విచారణ లో పరిష్కారానికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోక్సో చట్టం చాలా బలమైనదని, పోక్సో చట్టం గూర్చి విశ్రుత ప్రచారం జరగాలని అన్నారు. పోక్సో కేసులలో బెయిలు మామూలుగా లభించదని తెలిపారు.పోక్సో కేసులలో బాధితుల విషయంలో గోప్యత పాటించడం జరుగుతుందని వెల్లడించారు.మంచి చెడు విషయాలు పిల్లలు తెలుసుకోవాలన్నారు. చట్టాల విషయ పరిజ్ఞానం తెలియజేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.సమాజహితం జాతీయ లోక్ అదాలత్ లో ముడిపడి ఉన్నదని అన్ని ప్రజా సమూహాలు లోక్ అదాలత్ వైపు ప్రజలు కదిలే విధంగా ప్రేరణ నివ్వాలని జిల్లా జడ్జి భారత లక్ష్మీ ఆకాక్షించారు.ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్ ప్రసంగిస్తూ ప్రతి జాతీయ లోక్ అదాలత్ లో న్యాయవాదులు క్రియాశీలక పాత్ర పోషించారని, డిసెంబర్ 21 న నిర్వహించే జాతీయ లోక్  అదాలత్ కు మునుపటిలాగే చేయుతనందిస్తామని ఆయన తెలిపారు.ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ సంపూర్ణ సహాయ సహకారాలు అందుతుందని తెలిపారు. పోలీసుల తరపున విశ్రుత ప్రచారం చేసి ఫిర్యాదుదారులు, ముద్దాయిలను రాజీ దిశగా కదిలిస్తామని అన్నారు.న్యాయ వివాదాలను పరిష్కరించడానికి జడ్జిలు, న్యాయవాదులతో కూడిన లోక్ అదాలత్ బెంచ్ ల ఏర్పాటు,రాజీ పడదగిన కేసుల గుర్తింపు దిశగా కార్యాచరణ చేస్తున్నామని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి, ఆర్మూర్ మండల న్యాయసేవాధికార కమిటీ చైర్ పర్సన్ శ్రీదేవి తెలిపారు.జిల్లా జడ్జి భారత లక్ష్మీ జాతీయ లోక్ అదాలత్ ప్రచార గోడ పత్రులు ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ,ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ ఖాందేశ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ, బార్ ఉపాధ్యక్షుడు గట్టడి ఆనంద్, ప్రధాన కార్యదర్శి అనిల్ సీనియర్ న్యాయవాదులు లోక్ భూపతి రెడ్డి, మురళీధర్, శంకర్, అమితాబ్ కిరాడ్, సంగీత, వీణ లతో కలిసి ఆవిష్కరించారు.

More articles

Latest article