. . . యునియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కార్మిక వ్యతిరేక ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ ల రద్దు కోసం కార్మిక లోకం ఉద్యమించాలని యునియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి శ్రామిక భవన్ వద్ద మేడే కార్యక్రమం నిర్వహించి, జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వనమాల కృష్ణ, ఎం.నరేందర్ లు మాట్లాడుతూ ఒకవైపు ద్రవ్యోల్బణం, పన్నుల భారం, అధిక ధరలు కార్మికులను ప్రజలను పీడిస్తుంటే మరోవైపు కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడిదారులు కార్మికులను యదేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను తీసుకొచ్చిందన్నారు. వివిధ రంగాల కార్మికులు పోరాడి సాధించుకున్న ప్రత్యేక చట్టాలను కాలరాస్తూ ఉద్యోగ భద్రత లేని పరిస్థితిని పెంచిందన్నారు. సంఘటిత అసంఘటిత కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మార్చడమే నాలుగు లేబర్ కోడ్ ల లక్ష్యమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకన్న, టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, అరుణోదయ జిల్లా బాధ్యులు కే.గంగాధర్, చరణ్, గంగారం, యూనియన్ జిల్లా నాయకులు లింగం, కిరణ్, రవి, గంగాధర్, అమూల్య, గణేష్, సాయిబాబా, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
