26.2 C
Hyderabad
Monday, August 3, 2026

యాదగిరన్న త్యాగాల వారసత్వాన్ని కొనసాగిద్దాం

Must read

📰 Generate e-Paper Clip

సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు  కేజీ రామచందర్, కే. రమ

నిజామాబాద్, బతుకమ్మ :  యాదగిరన్న త్యాగాల వారసత్వాన్ని కొనసాగిద్దామని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కే. రమ అన్నారు. కమ్యూనిస్టు, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు యాదగిరి సంతాప సభను పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు యాదగిరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సంతాప సభకు సీపీఐ(ఎం.ఎల్)  మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అధ్యక్షత వహించారు.  సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్, కే.రమ లు ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి, జీవితాంతం విప్లవోద్యమమే జీవితంగా, ఆదర్శవంతంగా బ్రతికిన యాదగిరన్న  కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శమన్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, దాదాపు 33 ఏళ్లుగా ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా నాలుగు దశాబ్దాలకు పైగా జిల్లా కార్యదర్శిగా పనిచేశారన్నారు. జీవితాంతం ఆదర్శంగా నిలిచి, మరణించిన తర్వాత కూడా వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తమ శరీరాన్ని, మరొకరి చూపు కోసం తన నేత్రాలను దానంచేశారన్నారు. యాదగిరన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించాడన్నారు. యాదగిరన్నకు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నదన్నారు. యాదగిరన్న త్యాగపూరిత ధైర్య సాహసాల జీవితాన్ని గుర్తు చేసుకొని, ఆ త్యాగాల తరపు వారసత్వాన్ని నిలుపుటకు కృషి చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.నరేందర్, పి.రామకృష్ణ నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.వెంకన్న ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి.దేవారం బోధన్ డివిజన్ కార్యదర్శి డి.రాజేశ్వర్, నగర కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా నాయకులు గంగాధర్, ముత్తెన్న, సాయన్న, మల్లేష్, సురేష్, కిషన్, సత్తెక్క, డి.కిషన్, రమేష్, మురళి మరియు వివిధ పార్టీల ప్రజాసంఘాల నాయకులు కార్మికులు రైతులు రైతుకూలీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article