25.4 C
Hyderabad

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

Let us carry forward the fighting spirit of Chakali Ailamma.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్ఎస్ పీ, ఎఐపీఎస్ యూ నాయకులు వీరనారి ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులు

ఇందూర్, బతుకమ్మ :

నగరంలోని వినాయక్ నగర్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ, అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలను నేటి తరాలు గుర్తు చేసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సామాజిక న్యాయం కోసం చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డి. కృష్ణ, సునీల్, సూర్యపాల్, రంజిత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article