కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ సమీపంలో చిరుత కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి వస్తున్న బస్ లోని ప్రయాణికుల కంట పడింది. దీంతో కొట్టాల్ గ్రామ పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి చేరుకోవడానికి ఈ దారి వెంటే నిత్యం వందలది వాహనాల లో స్థానికుల ప్రయాణిస్తుంటారని తెలిపారు. అధికారులు బోన్ ఏర్పాటుచేసి చిరుతను బంధించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
