24.7 C
Hyderabad
Monday, August 3, 2026

నారాయణ స్కూలుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురాం, అంజలి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ స్కూలు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురాం, అంజలి డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని సుభాష్ నగర్ లో గల నారాయణ స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నగరంలోని నారాయణ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లేక్క రక్తం పిలుస్తూ వేల కొద్ది రూపాయలు ఫీజులు రూపంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. స్టేషనరీ పేరు తో ఒక విద్యార్థి దగ్గర 21 వేల రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. వెంటనే దీని పైన విద్యాశాఖ అధికారులు స్పందించి నారాయణ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని, దాంతోపాటు ఫీజు నియంత్రణ చట్టం అమలు అయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే నారాయణ విద్యాసంస్థల మీద చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, నాయకులు నవీన్ కృష్ణ ,టోకు,లక్ష్మణ్ ,రమేష్,దినేష్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article