నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కేర్ కళాశాల నిజామాబాద్ నందు ఈనెల 2న బుధవారం “మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్” ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్, అపోలో, యాక్సిస్ బ్యాంక్… తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ తెలిపారు. 2019 నుండి 2025 మధ్యన డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8688215980, 9182166182 నెంబర్లకు సంప్రదించగలరని పత్రికా ప్రకటనలో తెలిపారు.
