బతుకమ్మ, ఏర్గట్ల:మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎల్ఈడి ట్యూబ్ లైట్ వర్క్ షాప్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన 50 ఎల్ఈడి ట్యూబ్ లైట్ మెటీరియల్ తెప్పించి ఫిజికల్ సైన్స్ టీచర్ గాండ్ల రాజశేఖర్ పర్యవేక్షణలో విద్యార్థుల చేత తయారు చేయించినట్లు తెలియజేశారు. అదేవిధంగా నేర్చుకున్న సైన్సును నిత్యజీవితంలో అనువర్తింప చేయడమే నిజమైన జ్ఞానం అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గైడ్ టీచరుగా వ్యవహరించిన గాండ్ల రాజశేఖర్ మాట్లాడుతూ,ఎల్ఈడి ట్యూబ్ లైట్లను వాడడం వలన విద్యుత్ శక్తిని ఆదా చేయవచ్చని,మన ఇండ్లలో కూడా ఎల్ఈడి బల్బులని వాడే విధంగా తల్లిదండ్రులకు చెప్పాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిరుద్దీన్,ప్రసాద్, పవన్, రాజేందర్,రాజ నర్సయ్య, ఎస్ శ్రీనివాస్,సమిత, కే శ్రీనివాస్ విజయ్ కుమార్,ప్రవీణ్ శర్మ, ఇందిరా,గంగాధర్,సబిత పాల్గొన్నారు.
