29 C
Hyderabad
Monday, August 3, 2026

కరపత్రాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని దర్మోరా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రఘునందన్ ఆధ్వర్యంలో శుక్రవారం కర పత్రాలు విడుదల చేయడం జరిగింది. అనంతరం గ్రామంలో కరపత్రాల పంచుతు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కల్పిస్తున్న వసతుల గురించి, అలాగే విద్యార్థులను చదువుల పట్ల నిష్ణార్థులుగా చేయడం వల్ల వస్తున్న అద్భుత ఫలితాల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ సంవత్సరం పదవ తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగినదని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేసినారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, గౌరవ్, రాజేశ్వర్, కారోబార్ సాయన్న, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article