డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా నియామకమైన ప్రముఖ విద్యావేత్త రజనీకాంత్ ని శనివారం శాలువ, పూల బొకే తో ఘనంగా సన్మానించి, సావిత్రిబాయి పూలే జ్ఞాపిక ను అందించారు. ఈ సందర్భంగా బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, టిఎన్జివో జిల్లా అసోసియేటడ్ అధ్యక్షులు పెద్దొళ్ల నాగరాజు మాట్లాడుతూ రజనీకాంత్ సభ్యుడిగా తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి లో ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్, సుమన్, రంజిత్, ప్రుథ్వి తదితరులు పాల్గొన్నారు.

