27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గాండ్ల పేట్ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : గాండ్ల పెట్ వరద కాలువ (ఆక్యుడెక్ట్) గండి పడిన ఘటనపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని  గండి పడిన ప్రదేశాన్ని అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు బుదవారం ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం,  జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్. మాట్లాడుతూ వర్ధకాలువ సుమారుగా 130 కిలోమీటర్లు ఉంది. కాలువ కట్టలు, అక్విడేట్లు మెయింటెనెన్స్ సంబంధిత ఇరిగేషన్ అధికారులు చూడాలి. ఏ ప్రాంతంలో అయినా లీకేజీలు ఉన్నాయా! పరిశీలించాలి. ఇది పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.. ఈ ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మి కెనాల్ సుమారు మూడున్నర కిలోమీటర్ల తో నిర్మాణమై 22,000 ఎకరాలు నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో సాగు అవుతుంది. కానీ ఈ కాలువ శిథిలావస్థకు వచ్చిందని ఇప్పటికే రైతులు అనేకసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకుని నాథుడే లేడు. ఈ నేపథ్యంలోనే గాండ్లపేట ప్రమాదాన్ని పసికట్టడంలో ఇరిగేషన్ అధికారులు వైఫల్యం చెందార ని మా బృందం భావిస్తుంది అని అన్నారు. ఈ గండి పడడంతో మామిడి రాజన్నని దళిత రైతు మూడు ఎకరాలు వరి పంట మొత్తం సర్వనాశనమైంది. అంతేకాకుండా మీటర్ ఎత్తుతో ఉసికెమెటవేసింది.. తిరిగి సాగులోకి తీసుకురావాలంటే కనీసం నాలుగు లక్షల రూపాయలు దళిత రైతుకు ఆర్థిక భారం పడుతుందని , మొత్తం వరి పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.దీంతోపాటు గత నాలుగు సంవత్సరాలుగా ఈ దళిత కుటుంబం తమ పట్టా భూమిని ఆన్లైన్ ఎక్కించమని అధికారుల చుట్టూ తిరుగుతున్న దళిత రైతును పట్టించుకున్న పాపాన పోలేదు. వెంటనే దళిత రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వరద కాలువతో పాటు 284 కిలోమీటర్ల కాకతీయ కాలువ లో పూ డికతో నిండిపోయిందని లోకమెరిగిన సత్యం.  సర్వే చేసి లోటుపాట్లను సరిచేయాలని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూడిక పూర్తిగా నిండిపోయి సామర్థ్యం తగ్గిపోతుందని ఉత్తర తెలంగాణ రైతాంగానికి పెను ప్రమాదం ఏర్పడుతుందని సామర్థ్యాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, వి.బాలయ్య, మాజీ ఎంపీటీసీ డాక్టర్ సత్యనారాయణ గౌడ్, జిల్లా నాయకురాలు సత్యక్క, రాజారెడ్డి, దయాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leaders inspect the area where Gandlapet collapsed

More articles

Latest article