25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

లీడర్ వర్సెస్ ఆఫీసర్

Must read

📰 Generate e-Paper Clip

  • డీఈఓ ఆఫీస్ లో గొడవకు దిగిన ఇద్దరు
  • పెద్ద సార్ వద్దకు పంచాయితీ
  • చర్యలు తీసుకుంటారా లేదా అనే సంశయాలు

 

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిప్యూటేషన్ ఉద్యోగి, అధికారి ఒకరు గొడవ పడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని డీఈఓ ఆపీస్ లో సర్వ శిక్షా అభియాన్ క్లర్క్ వర్సెస్ విద్యాశాఖ అదికారి గొడవ పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం సర్వ శిక్షా అభియాన్ లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న క్లర్క్ కు విద్యాశాఖ లో కీలక అధికారికి మధ్య కేజీబీవీ ఫైల్ పై సంతకం పెట్టకపోవడం తో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పంచాయితీ చివరికి జిల్లా విద్యాశాఖ అధికారి వద్దకు చేరింది. అక్కడ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న పంచాయితీ పై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖలో డిప్యూటేషన్ లు ప్రహసనంగా మారాయి. ఉపాధ్యాయులు కావచ్చు లేదా బోధనేతర సిబ్బంది కావచ్చు డిప్యూటేషన్ లపై పనిచేస్తు అధికారులకు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. జిల్లా విద్యాశాఖా కార్యాలయంలో డిప్యూటేషన్ పై కొందరు వివిధ సెక్షన్ లు పర్యవేక్షిస్తున్నారు. వారు బోధనేతర సిబ్బంది నాయకులుగా చలమాణి అవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల లీడర్ల మాదిరిగా సెక్షన్ లలో తీష్టవేసిన నాన్ టీచింగ్ స్టాఫ్ మూడేళ్లైనా అక్కడి నుంచి కదలడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బోధనేతర సిబ్బందిని బదిలీ చేసిన కొందరు లీడర్ల ముసుగులో ఉండిపోయారు. ఇటీవల కాలంలో సర్వ శిక్షా అభియాన్ పై అందరి నజర్ ఉంది. ప్రధానంగా ఏసీబీ భయం వెంటాడుతుంది. పీయంశ్రీ తో పాటు వివిద విద్యాసంస్థలకు జరగాల్సిన ఖర్చులు, చెల్లింపుల వ్యవహరం అంతా ఎఫ్ఏఓ కీలకం.   అలాంటి పైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ కు కాపీ టూగా పెట్టిన వాటి వివరాలు అడిగితే గొడవ పడటం, దానికి అందరిని లాగిన వ్యవహరం చర్చనీయాంశంగా మారింది.

మూడేళ్లు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని మార్చాలనే నిబంధన ప్రభుత్వ శాఖలో ఉంది. అందున అధికారులు, సిబ్బంది ఒక్కటే చోట పనిచేస్తే ముదరడం, కాసులకు అలవాటు పడి అవినీతి అక్రమాలకు పాల్పడటం సహజంగా జరుగుతుంది. ఐతే విద్యాశాఖ కార్యాలయం కొందరికి బంగారు గుడ్లు పెట్టే బాతులాంటింది. అందరికి పాఠశాలల పర్మిషన్ లు, రెన్యువల్ ఒక్కటే కాసులు కురిపిస్తుందనే ప్రచారం నిజం కాదు. సర్వ శిక్షా అభియాన్ లో పనిచేసే వాళ్ళు మామూలు ముదుర్లు కాదు. అక్కడ ప్రతిపనికి పైసలు ఇవ్వాల్సిందే. దానిని క్యాష్ చేసుకునేందుకు చాలా మంది డిఇఓ కార్యాలయంలో తిష్టవేశారు. వారిని కదిలించి పంపుదామంటే తాము లీడర్లమని ఎదురు సమాధానం చెబుతున్నారు. ఇటీవల డీఈఓ ఆఫీసులో గొడవకు దిగిన వారు అందరు కాసులు తీసుకునేవారు అనే ధోరణిలో డీఈఓ వద్దనే గొడవ పడిన దాఖాలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ముడేళ్లకు పైబడి పనిచేస్తున్న డిప్యూటేషన్ ఉద్యోగులను కదిలిస్తారా లేదా అని వేచి చూడాలి.

More articles

Latest article