26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలను నిర్మించండి

Must read

📰 Generate e-Paper Clip

పీడీఎస్ యు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ పిలుపు

బతుకమ్మ, సిరికొండ : విద్యార్థి అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని, శాస్త్రియ విద్యావిధానం కోసం, నవసమాజం నిర్మాణం కోసం పోరాడాలని పీడీఎస్ యు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పి.రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో పీడీఎస్ యు ధర్పల్లి, భీమగల్, సిరికొండ మండలాల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్ యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభల పోస్టర్స్ & లోగో ల ఆవిష్కరణ చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు కోట్లాది మందిలో చలనాన్ని అందించి పోరుబాటలో నడిపించిన సంస్థ పీ.డీ.ఎస్.యూ అని అన్నారు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ లో జార్జ్ రక్తంతో తడిసిన బిగి పిడికిలి పతాకం జె.సి. ఎస్. ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, చేరాలు, కోలా శంకర్, చాంద్ పాషా,
స్నేహలత, రంగవల్లి, రమణయ్య, సాంబయ్య, తదితరుల త్యాగాల చరిత్రతో విద్యార్థి ఉద్యమాన్ని ఉదoతం చేసిన పీ.డీ.ఎస్.యూ కోట్లాది విద్యార్థులకు మార్గదర్శి అయ్యిందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని ఉద్యమాలు కొనసాగిస్తున్న విద్యార్థి సంఘం పీ.డీ.ఎస్.యూ అని అన్నారు. ఈ దేశంలో పేదలు అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులందరికీ సమానమైన, శాస్త్రీయమైన విద్యను అందించాలని, విద్యార్థి ఉద్యమాలను కొనసాగిస్తున్న సంస్థ పీడీఎస్ యు అన్నారు .ఈ నెల 30న న రాష్ట్ర స్థాయిలో హైదరాబాదులో జరిగే 50 వసంతాల స్వర్ణోత్సవ సభలో 50 ఏళ్ల విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించి, విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో, భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుందని వెల్లడించారు.నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని,రాష్ట్ర స్థాయిలో జరిగే
సభకు విద్యార్థులు, పూర్వ, ప్రస్తుత పీడీఎస్ఈయు నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, సభను విజయవంతం చేయాలి ఆయన కోరారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ,పీడీఎస్ యు జిల్లా మాజీ కార్యదర్శి ఆర్.దామోదర్,జి.సాయరెడ్డి, మండల నాయకులు ఈ. రమేష్,ఎం.లింబాద్రి,బి.కిషోర్,బి.బాలకిషన్,పీడీఎస్ యు ఆర్మూర్ డివిజన్ నాయకులు కె.అశిష్,ఆర్.విశ్వాతేజ్,డి.ప్రవీణ్,ఆర్.మురళి, డి.తిరుపతి,డి.కళ్యాణ్,ఆర్.ప్రణీత్ , పాల్గొన్నారు.

More articles

Latest article