30.9 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ సదస్సులో పాల్గొననున్న న్యాయవాది కొండాపురం వెంకట్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజ్యాంగం పై సవాళ్లు, దృక్పథాలు, పరిష్కారాలు అనే అంశంపై ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆగస్టు 2న జరుగనున్న జాతీయ సదస్సులో రాజన్న సిరిసిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా వైస్ చైర్మన్ మరియు ఎల్లారెడ్డిపేట మండల యువ న్యాయవాది కొండాపురం వెంకట్రెడ్డి పాల్గొనబోతున్నారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి లీగల్ సెల్ న్యాయవాదులు ఈ సదస్సులో భాగస్వాములవుతారు.ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, వేములవాడ శాసన సభ్యులు అది శ్రీనివాస్,  నియోజకవర్గ ఇంచార్జ్ కే కే  మహేందర్ రెడ్డి , రాష్ట్ర కన్వీనర్ బుర్ర రవితేజ గౌడ్,  జిల్లా చైర్మన్ ఇరుకుళ్ళ అశ్విన్, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య, మండల కాంగ్రెస్ నాయకులకు కొండాపురం వెంకట్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article