జాతీయ సదస్సులో పాల్గొననున్న న్యాయవాది కొండాపురం వెంకట్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజ్యాంగం పై సవాళ్లు, దృక్పథాలు, పరిష్కారాలు అనే అంశంపై ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఆగస్టు 2న జరుగనున్న జాతీయ సదస్సులో రాజన్న సిరిసిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా వైస్ చైర్మన్ మరియు ఎల్లారెడ్డిపేట మండల యువ న్యాయవాది కొండాపురం వెంకట్రెడ్డి పాల్గొనబోతున్నారు.ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి లీగల్ సెల్ న్యాయవాదులు ఈ సదస్సులో...