30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వడదెబ్బపై ఆరోగ్య చైతన్య వేదిక కరపత్రాల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ సహకారంతో వడదెబ్బపై ముద్రించిన కరపత్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డా.బి రాజశ్రీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆరోగ్య చైతన్య వేదిక సేవ సంస్థ ఆధ్వర్యంలో వడదెబ్బపై కరపత్రాలు వేయించి అవగాహన కలిగించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అన్ని జాతియ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్యంపై ప్రజల్లో స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం సంతోషించదగ్గ విషయమని, ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఇంకా అనేక కార్యక్రమాలపై స్వచ్ఛందంగా అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య చైతన్య వేదిక స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు, రాష్ట్ర కన్వీనర్ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటేష్, నియోజకవర్గ కన్వీనర్లు నిజాంబాద్ రూరల్ వై. శంకర్, నిజామాబాద్ అర్బన్ వి .ప్రవీణ్ రెడ్డి, ఆరోగ్య చైతన్య వేదిక ప్రతినిధులు హెచ్ ఈ ఓ కరిపే రవీందర్, డిహెచ్ఈలు వేణుగోపాల్, సలీం, మనోహర్ పాల్గొన్నారు.

More articles

Latest article