వడదెబ్బపై ఆరోగ్య చైతన్య వేదిక కరపత్రాల ఆవిష్కరణ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆరోగ్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇందూర్ మదర్ హుడ్ హాస్పిటల్ సహకారంతో వడదెబ్బపై ముద్రించిన కరపత్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డా.బి రాజశ్రీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆరోగ్య చైతన్య వేదిక సేవ సంస్థ ఆధ్వర్యంలో వడదెబ్బపై కరపత్రాలు వేయించి అవగాహన కలిగించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అన్ని జాతియ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్యంపై ప్రజల్లో స్వచ్ఛందంగా అవగాహన కలిగించడం సంతోషించదగ్గ విషయమని, ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఇంకా అనేక...