27.2 C
Hyderabad

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణలో సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను బుధవారం అధికార సిబ్బంది ప్రారంభించారు. సర్వేలో భాగంగా శిక్షణ తీసుకున్న అధికార సిబ్బంది మొదటి దశలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు వేయడం ప్రారంభించారు. ఇంటి నెంబర్, యజమాని పేరు రాసుకొని ప్రతి ఇంటికి స్టిక్కర్ వేసి సర్వేకు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ తదితర విషయాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మొదటి మూడు రోజులు స్టిక్కర్లు వేయడం అయిపోయిన తర్వాత ఇంటింటికి తిరిగి సర్వే వివరాలు నమోదు చేసుకుంటామని ఉపాధ్యాయుడు లక్ష్మణ్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article