- ఈ నెల 26 తో ముగియనున్న పాలకవర్గం పధవి కాలం
- వివాధాలకు కేరాప్ గా నిలిచిన కార్పోరేటర్ లు
- బిల్డింగ్ పర్మిషన్ ల పేరిట బలవంతపు వసూళ్లకు పేట్టింది పేరు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దళిత బందు కేటాయింపుల పేరిట లక్షల వసూళ్లు
- అపార్ట్ మెంట్ లు కడితే ప్లాట్ రిజస్ర్టేషన్ చేయాల్సిందే
- ప్రజల సంక్షేమం మరిచి స్వ ప్రయోజనాలకే పెద్ధ పీట
- నేడు పాలకవర్గం చివరీ సమావేశం
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గం చివరి ఘడియలను లెక్కిస్తుంది. నిజామాబాద్ నగర పాలక సంస్థ పాలకవర్గం పధవి కాలం ఈ నెల 26 తో ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గం పధవి కాల ముగియ నుండడంతో చివరి సాధరణ పాలకవర్గం సమావేశం శనివారం జరుగనుంది. ఇప్పటి వరకు ప్రస్తుత పాలకవర్గం సమావేశాలను రహస్యంగా మిడియాకు అనుమతించని పాలకవర్గంగా పేరుగాంచింది. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల సారం అంతా పదిలైన్లకు మించకుండా మేయర్ బ్రీఫ్ చేయడం పరిపాటిగా మారింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎన్నుకున్న స్థానిక కార్పోరేటర్ల ద్వార నిజామాబాద్ నగరం , కాని కనీసం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ లో జరిగిన డేవలప్ మెంట్ చూస్తే నగరం ఎంతగా వెనుకబడిపోయిందో అవగతమౌతుంది. నిజామాబాద్ నగరం మున్సిపాల్టీ నుంచి మున్సిపల్ కార్పోరేషన్ గా రూపాంతరం చెంది 2 దశాబ్ధాలు గడిచిన డివిజన్ లు పేరిగాయి, నగర విస్థరణ పేరిగింది కాని నగరం డేవలప్ మెంట్ ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్నచంధంగా మారింది. కోట్లు పోసి తయారు చేసిన మాస్టర్ ప్లాన్ ను అసెంబ్లికి అమోదంకు పంపి అటకేక్కించారు. దానితో నిజామాబాద్ నగరం కాదు పట్టణంకు ఎమాత్రం తీసిపోని డేవలప్ మెంట్ కు పరిమితమైంది. 20 ఎళ్ల క్రితం పురుడు పోసుకున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో వంధల కోట్ల రూపాయాలు ఖర్చైనా బకేట్ నీళ్లను ఇప్పటికి ఎత్తిపోయలేదు. నిజమాబాద్ నగర ప్రజలకు అహ్లధం కోసం ఓక్క పార్కు కుడా ప్రజలకు అందుబాటులోకి తేవడంలో విఫలమయ్యారు. ప్రజలకు అవసరాల మేరకు రోడ్ల విస్థరణ అసలు జరుగలేదు. ఎదైనా చేశారా అంటే డివైడర్ ల నిర్మాణం అందులో మిడియన్ ప్లాంటేషన్ , కోత్తగా రోడ్లపై తారు మాత్రం వేశారు. గల్లిలో డ్రైనేజీల నిర్మాణం చేశారు, చిన్న చితక రోడ్లు వేశారు కాని వాటికి అప్పుడే కాలం చెల్లింది.
పాలకులు వస్తారు ఎదో చేస్తారని నమ్మి ప్రజలు ఎన్నుకున్న కార్పోరేటర్ లు అధికార పార్టి ఎమ్మెల్యేల చుట్టురా ప్రధర్శనలకు పరిమితమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా కార్పొరేటర్లుగా ఎన్నికైనా వారు వివాధాలకు కేరాఫ్ గా నిలిచారు.నిజామాబాద్ నగరం లో 13 గ్రామాలు విలీనం కావడంతో 50 డివిజన్ లు ఉన్న నగర పాలక సంస్థ 60 డివిజన్ కు విస్థరించారు. 2020 జనవరి లో జరిగిన బల్ధియా ఎన్నికలలో బిజేపి 28 డివిజన్ లను గెలిచి మేయర్ స్థానం త్రుటిలో కోల్పోయింది. బిఆర్ఎస్ 13 స్థానాలు, ఎంఐఏం 16 స్థానాలు, కాంగ్రెస్ 2 , ఓక్కరు స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అనాడు బిఆర్ఎస్, మజ్లీస్ పార్టిల పోత్తుతో ధండు నీతు కిరణ్ మేయర్ గా, ఇద్రిస్ ఖాన్ డిప్యూటి మేయర్ అయ్యారు. నిజామాబాద్ బల్ధియాకు ఐఏఎస్ లు కమిషనర్ లుగా ఉన్న కార్పొరేషన్ కు ఒరిగిందేమి లేదు. వారు అధికార పార్టీ నేతల కీలుబొమ్ములుగా మిగిలిపోయారు. మరికొంత మంది కార్పొరేటర్లతో మిలాఖత్ అయి అందినకాడికి దండుకున్నారు. ఏసీబీ కేసుల చరిత్రలో ప్రస్తుత పాలకవర్గంలోనే కోట్ల రూపాయల ఆదాయానికి మించి ఆస్తుల కేసు వెలుగు చూడడం విశేషం.
ఇప్పటి వరకు పాలకవర్గంలోని కార్పొరేటర్లు వివాదస్పదులుగా మారారు. భార్యల బదులు భర్తలు, తల్లుల బదులు కొడుకులు ఇంచార్జీ కార్పొరేటర్లుగా అవతారం ఎత్తారు. ప్రతి పనికి పర్సంటేజ్ లను గుంజే రకంగా పరిస్థితి దారుణంగా మారింది. నిజామాబాద్ నగరంలోని కొన్ని డివిజన్ లలో ఇంటి పర్మిషన్ లు పేరిట బలవంతపు వసూళ్ల వ్యవహరం రచ్చరచ్చగా మారింది. ఇంటి కోసం, వాణిజ్య సముదాయాలు, అపార్టమెంట్ ల కోసం పునాదులు తీయడం ఆలస్యంగా కార్పొరేటర్లు గద్ధలలాగా అక్కడ వాలి బలవంతంగా వసూళ్లు చేయడం లేకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులలో పర్మిషన్ ల విషయంలో కొర్రిలు పెట్టడం, అపార్ట్ మెంట్ లలో ఏకంగా ప్లాట్లను రిజిస్ర్టేషన్ చేసుకున్న ఘనత దక్కించుకున్నారు. ఏకంగా మరికొందరు తమ డివిజన్ లో ఉన్న బల్ధియా స్థలాలను కబ్జా చేశారు. నగరంలో అత్యంత ఖరిధైనా ప్రాంతంగా ఉన్న ఖలీల్ వాడిలో తిలక్ గార్డేన్ కాంప్లేక్స్ లో మడిగేలను చెరబట్టారు. దళిత బందు కోసం కార్పొరేటర్లు ఒక్కోక్క దళితుడి వద్ధ రూ. 2 లక్షల మొదలుకోని 5 లక్షలు వసూళు చేశారు. అది సరిపోదని అడ్వాన్స్ గా వసూలు చేసినవి తొమ్మిది కోట్లని అంచనా. దళిత బందును కొత్త ప్రభుత్వం కొనసాగించకపోవడంతో అడ్వాన్స్ లు ఇచ్చిన వారు కార్పొరేటర్ల ఇంటి చుట్టు చక్కర్లు కొడుతున్నారు. ఇక నిజామాబాద్ బల్ధియాలో జరిగిన పారిశుధ్య సిబ్బందిని ఔట్ సొర్సింగ్ ఉద్యోగల భర్తికి అందరు వసూళ్లు చేశారు. ఒక్కోక్కరి నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారు. కొంత మందిని జవాన్లుగా, సానిటరి ఇన్స్ పెక్టర్లుగా, వర్కింగ్ ఇన్స్ పెక్టర్లుగా, రెవెన్యూలో బిల్ కలెక్టర్లుగా నియమిస్తారని, అదనంగా వసూల్ చేశారు. ప్రతి డివిజన్ కు పది మంది చొప్పున కేటాయించుకుని పంచుకున్న చరిత్రను దక్కించుకున్నారు. ఇక ప్రభుత్వ భూములను, పేదలకు కేటాయించిన భూములను చెరబట్టి వారి చేత దాడులకు గురైన ఘనత ప్రస్తుత కార్పొరేటర్లకే దక్కింది.
