27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాఠశాలకు ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ ఆధ్వర్యంలో ల్యాప్ టాప్ ల విరాళం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : విద్యా రంగంలో ఆధునిక సాంకేతికతను అందించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ సంస్థ కందర్పల్లి ప్రాథమిక పాఠశాలకు రెండు ల్యాప్టాప్లను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ, త్వరలోనే పాఠశాలలో ‘ఫ్యూచర్ స్కిల్స్ ల్యాబ్’ ను స్థాపించనున్నట్లు తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు — డిజిటల్ లిటరసీ, కోడింగ్, సృజనాత్మక ఆలోచన వంటి అంశాలను నేర్చుకొనే అవకాశం పొందనున్నారు. “గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి విద్యార్థి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాలి అనేది మా ప్రధాన లక్ష్యం” అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article