పాఠశాలకు ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ ఆధ్వర్యంలో ల్యాప్ టాప్ ల విరాళం
బతుకమ్మ, బిచ్కుంద : విద్యా రంగంలో ఆధునిక సాంకేతికతను అందించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్ట్ సంస్థ కందర్పల్లి ప్రాథమిక పాఠశాలకు రెండు ల్యాప్టాప్లను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ, త్వరలోనే పాఠశాలలో ‘ఫ్యూచర్ స్కిల్స్ ల్యాబ్’ ను స్థాపించనున్నట్లు తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు — డిజిటల్ లిటరసీ, కోడింగ్, సృజనాత్మక ఆలోచన వంటి అంశాలను నేర్చుకొనే అవకాశం పొందనున్నారు....