- నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన లంబాడీ జనం
- జన సంద్రోహమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం
భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లంబాడీ జేఏసి ఆధ్వర్యంలో భూక్యా రమేష్, లావుడ్య ప్రసాద్ నాయక్ అధ్యక్షతన లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యాడ్ నుండి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు లంబాడీ ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లంబాడీ జేఏసి నాయకులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,గుగులోత్ రాజేష్ నాయక్,డాక్టర్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ లంబాడీల పై జరుగుతున్న అసత్వ ప్రచారాన్ని తిప్పికొడుతూ నినాదాలతో హోరెత్తిన్న భద్రాద్రి ఎస్టీ నుండి లంబాడీలను తొలిగించడం ఎవడి తరం కాదని,లంబాడీల ఆత్మగౌరవం దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. లంబాడీలు బ్రిటీష్,నిజాం కాలం నుండే ఎస్టీలుగా గుర్తించబడ్డారని, కొత్తగా లంబాడీలు ఎస్టీ కాదని చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. భారత రాజ్యాంగం అమలులో వచ్చిన రోజునే ఆర్టికల్ 342 ప్రకారం ఆంధ్ర,రాయలసీమ ప్రాంత సుగాలి లు ఎస్టీ లుగా ఉన్నారని మాజీ ప్రధాని మంత్రి ఇందిర గాంధీ హయాంలో సుగాలి,లంబాడీ,బంజారాలు ఒక్కటేనని గుర్తించి 1976 ఏరియా రిమూవల్ రెస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా లంబాడీలను ఎస్టీలుగా గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతం నిజాం పాలన లో ఉన్న కారణంగా 1950 నుండి 1976 వరకు సుమారు 26 సంవత్సరాలు తెలంగాణ లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు పొందలేక పోయామని వాపోయారు. సోకాల్డ్ నాయకులు తెల్లం.తన ఓటమి తేటతెల్లం అయ్యిందని తెలిసి అన్నదమ్ముల కలిసి మెలిసి ఉన్న గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం సరికాదని హెచ్చరించారు. స్వలాభం కోసమే తెల్లం,సోయం గిరిజన తెగల మధ్య చిచ్చు పెడుతున్నారని తెలుసుకొని, ఇద్దరిని ఆదివాసీ సమాజం నమ్మడం లేదని,వీళ్ళ వెనక ఉండి నడిపించే అదృశ్య శక్తులు ఎవరో లంబాడీ సమాజానికి తెలుసని వారిని వెంటాడి మరీ ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. అన్నదమ్ముల ఉండి ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం రండని భద్రాద్రి కొత్తగూడెం లంబాడీ జేఏసి పిలుపు ఇచ్చారు. ఈ ర్యాలీ లో ప్రేంచంద్ నాయక్,స్వరాజ్ నాయక్,హుస్సేన్ నాయక్,సంజీవ్ నాయక్,డాక్టర్ రాజ్ కుమార్,వీరు నాయక్,డాక్టర్ వెంకన్న,లాల్సింగ్ నాయక్,కిషన్ నాయక్,కాన్షీరాం,రాములు,హతీరామ్,రవి రాథోడ్,లాలు నాయక్,హుస్సేన్ నాయక్, కిషోర్ సింగ్, లాలూ నాయక్,బాలు,రాంజీ,శోభన్,జంకిలాల్,రవి,శంకర్ నాయక్,చందర్,బిచ్చ నాయక్,ఈర్య,పూల్సింగ్, వీరన్న,నాగరాజు,కిషన్ నాయక్,గణేష్ రాంచందర్ నాయక్ జనార్దన్ నాయక్,మంగిలాల్,కేశవ,గడ్డం శ్రీను,శ్రీను,రాంబాబు నాయక్ దేవీలాల్,ఉపేందర్,బాలకృష్ణ,బాబూలాల్,యమున,మోతీలాల్,లక్ష్మి బాయి,రుక్మిణి బాయి,ఆమని,సుశీల,పార్వతి,సక్రు,బాలు,దేవిసింగ్,మూడ్ బాలాజీ,హరిలాల్,పూర్ణచందర్ ,తదితరులు పాల్గొన్నారు.