27.5 C
Hyderabad
Friday, July 31, 2026

జుట్లు పట్టుకొని కొట్టుకున్న లేడీ టీచర్లు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: పని విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా ఇద్దరు లేడీ టీచర్లు జుట్లు పట్టుకొని పాఠశాలలో కొట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ లో ఉన్న ఏకలవ్య ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్ గా ప్రవీణ దహియా, లైబ్రేరియన్ గా మధురాణి పని చేస్తున్నారు.

వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా పని విషయంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరస్పర దాడికి దారితీసింది. ఇద్దరు ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడంతోపాటు జుట్లు పట్టుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. తోటి సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు.

లేడీ టీచర్ల ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్య ప్రదేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇద్దరు టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించారు.

More articles

Latest article