లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

0 8,889

 

. . . టియుసిఐ జిల్లా నాయకులు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కార్మిక హక్కులను, చట్టాలను రద్దుచేసి యాజమాన్యాలకి అనుకూలమైన చట్టాలు తేవడం సిగ్గుచేటని, వెంటనే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని టియుసిఐ జిల్లా నాయకులు డి.కిరణ్, ఎన్. రవికుమార్ లు అన్నారు. తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు మున్సిపల్ సర్కిల్ లలో 140వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు. మున్సిపల్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేవన్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులకు వస్తున్న వేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. కనీస వేతనాలు 26,000 అమలు చేయాలన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ ల రద్దుకై, కనీస వేతనాలు అమలు కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేశ్వర్, విజయ్ కుమార్, శాంతి కుమార్, లక్ష్మీకాంత్, రాము, లక్ష్మణ్, శివ కుమార్, గంగాధర్, రమేష్, రాజు, శ్రీనివాస్, యాదమ్మ, శైలజ, లక్ష్మి, రాధా, తదితరులు పాల్గొన్నారు.

 

Labor codes should be repealed.

Leave A Reply

Your email address will not be published.