27.5 C
Hyderabad
Friday, July 31, 2026

కురుమ కులస్తులు అన్ని రంగాలలో రాణించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అందరికీ అండగా మేముంటాం
  • నుడా చైర్మన్ కేశవేణు

 

 బతుకమ్మ బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం, సాలూరు మండలం, మందర్న గ్రామంలో కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం మందర్న కురుమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. ఉదయం నుండే ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కలశాలతో, మంగళహారతులతో, బోనాలను, నైవేద్యాలను భాజా భజంత్రీలతో ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. పౌరోహితులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం కురుమ సంఘ సంప్రదాయం ప్రకారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురుమ సంఘం అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నూడా) చైర్మన్ కేశ వేణు, ఉమ్మడి జిల్లాల సహకార సంఘం అధ్యక్షులు మర్కంటి భూమన్న లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కురుమ సంఘం నాయకులు అన్ని రంగాలలో రాణించాలని, మన ఉనికిని చాటాలని, యువత ముందుకు రావాలని, ప్రతి కుటుంబంలో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థానాలలో స్థిరపడాలని, ఉన్నత చదువులకై పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారం, ప్రోత్సాహం ఉంటుందని, అన్నిటికీ అండగా మేముంటామని తెలిపారు. అలాగే విశిష్ట అతిధిగా  రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఆలయం వద్ద జరిగిన విశేష పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించినందుకు మందర్న గ్రామ కురుమ సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు వీరుగొండ రాజు, కమిటీ కార్యవర్గ సభ్యులు తొండ గురు దేవన్న, నరసన్న, గంగాధర్, గణేష్, విట్టల్, గురూజీ, రమేష్, శ్రీనివాస్, గంగాధర్, బోధన్ మండల కురుమ సంఘం అధ్యక్షులు మేడి రవి, సహకార సంఘం అధ్యక్షులు దేవరావు, సాలూర మండల బిజెపి అధ్యక్షులు, మందర్న మాజీ సర్పంచ్, గ్రామ కురుమ అధ్యక్షులు రావుబా గంగాధర్, బోధన్ పట్టణ అధ్యక్షులు వీరయ్య, ప్రముఖులు రాజు, చందు, భూమన్న, సాయిలు, మహేష్, అశోక్, గౌరుకొండ భాస్కర్, శెట్టి కొండ హనుమంతు, మల్లేష్, అబ్బయ్య, కడికొల్ల శంకర్ తదితర మండలాల కురుమ సంఘ ప్రముఖ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన అతిథులకు, ప్రముఖులకు మందర్న కురుమ సంఘ కమిటీ అధ్యక్షులు రావుబాగంగాధర్, కమిటీ సభ్యుల, యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Kuruma caste people should excel in all fields

More articles

Latest article