కురుమ కులస్తులు అన్ని రంగాలలో రాణించాలి

అందరికీ అండగా మేముంటాం నుడా చైర్మన్ కేశవేణు    బతుకమ్మ బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం, సాలూరు మండలం, మందర్న గ్రామంలో కురుమల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవం మందర్న కురుమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. ఉదయం నుండే ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు కలశాలతో, మంగళహారతులతో, బోనాలను, నైవేద్యాలను భాజా భజంత్రీలతో ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి...